Showing posts with label స గుప్తమూలప్రత్యన్తః. Show all posts
Showing posts with label స గుప్తమూలప్రత్యన్తః. Show all posts

Saturday, September 8, 2018

రఘువంశమ్- 4.26

శ్లోకః
స గుప్తమూలప్రత్యన్తః శుద్ధపార్ష్ణిరయాన్వితః
షడ్విధం బలమాదాయ ప్రతస్థే దిగ్జిగీషయా ॥4.26॥

పదవిభాగః
సః గుప్త-మూల-ప్రత్యన్తః శుద్ధ-పార్ష్ణిః అయ-అన్వితః షట్-విధం బలమ్ ఆదాయ ప్రతస్థే దిక్-జిగీషయా ॥4.26॥

అన్వయః
గుప్తమూలప్రత్యన్తః శుద్ధ-పార్ష్ణిః అయాన్వితః సః (యః) షడ్విధం బలమ్ ఆదాయ దిగ్జిగీషయా ప్రతస్థే

వాచ్యపరివర్తనమ్
గుప్తమూలప్రత్యన్తేన శుద్ధపార్ష్ణినా అయాన్వితేన తేన (రఘుణా) షడ్విధం బలమ్ ఆదాయ, దిగ్జిగీషయా ప్రతస్థే

సరలార్థః
స రఘుః ప్రథమం స్వీయరాష్ట్రదుర్గాణాం పృష్ఠదేశస్య చ సర్వథా రక్షాం కృత్వా యత్ర కాలోచితం సమ్పూర్ణం మఙ్గలం విధాయ, పడ్విధం బలమాదాయ దిగ్జిగీషయా ప్రస్థానం చకార.

తాత్పర్యమ్
తన నివాసస్థానముమునకు సమీపస్థమైన దుర్గాన్ని (ముందుగా) రక్షించుకున్నాడు. (తరలి వెళుతున్న) తన వెనుక వైపు రక్షణను కల్పించుకున్నాడు. అటు పిమ్మట, రఘువు ఆరు రకాలైన బలాలను సమకూర్చుకొని దిగ్విజయం కోసం బయలుదేరాడు.

[మూలబలము, సుహృద్బలము, భృత్యబలము, శ్రేణీబలము, ద్విషద్బలము, ఆటవికబలము అనిఇ షడ్విధబలములుకేశవపంతుల వారి వ్యాఖ్య నుంచి]