Showing posts with label తస్యానీకైర్విసర్పద్భిః. Show all posts
Showing posts with label తస్యానీకైర్విసర్పద్భిః. Show all posts

Friday, September 14, 2018

రఘువంశమ్- 4.53


శ్లోకః
తస్యానీకైర్విసర్పద్భిరపరాన్తజయోద్యతైః
రామాస్త్రోత్సారితోఽప్యాసీత్ సహ్యలగ్న ఇవార్ణవః 4.53

పదవిభాగః
తస్య అనీకైః విసర్పద్భిః అపర-అన్త-జయ-ఉద్యతైః రామ-అస్త్ర-ఉత్సారితః అపి ఆసీత్ సహ్య-లగ్నః ఇవ అర్ణవః

అన్వయః
అపరాన్తజయోద్యతైః విసర్పద్భిః తస్య (రఘోః) అనీకైః రామాస్త్రోత్సారితః అర్ణవః చ సహ్యలగ్న ఇవ ఆసీత్4.53

వాచ్యపరివర్తనమ్
విసర్పద్భిః అపరాన్తజయోద్యతైః తస్య అనీకైః రామాస్త్రోత్సారితేన అపి అర్ణవేన సహ్యలగ్నేన ఇవ అభూయత

సరలార్థః
పరశురామస్య శరైః ఉత్సారితః సన్నపి సాగరః సముద్రవత్ అపరిచ్ఛిన్నేన ప్రచలతా రఘుసైన్యప్రవాహేణ పునరపి సహ్యలగ్న ఇవ అలక్ష్యత

తాత్పర్యమ్
పడమటి సీమలను జయించుటకు పూనుకొని వెళుతున్న రఘుసైన్యము కారణముగా - పరశురాముడి అస్త్రముల వలన దూరంగా నెట్టబడిన - సముద్రము మళ్ళీ సహ్యాద్రిని అంటుకొని ఉన్నదా అన్నట్లున్నది.