Showing posts with label ప్రససాదోదయాదమ్భః. Show all posts
Showing posts with label ప్రససాదోదయాదమ్భః. Show all posts

Saturday, September 8, 2018

రఘువంశమ్- 4.21

శ్లోకః
ప్రససాదోదయాదమ్భః కుమ్భయోనేర్మహౌజసః
రఘోరభిభవాశఙ్కి చుక్షుభే ద్విషతాం మనః4.21॥

పదవిభాగః
ప్రససాద ఉదయాత్ అమ్భః కుమ్భ-యోనేః మహా-ఓజసః రఘోః అభిభవ-ఆశఙ్కి చుక్షుభే ద్విషతాం మనః

అన్వయః
మహౌజసః కుమ్భయోనేః ఉదయాత్ అమ్భః ప్రససాద, రఘోః అభిభవాశఙ్కి ద్విషతాం మనః చుక్షుభే 4.21॥

వాచ్యపరివర్తనమ్
మహౌజసః కుమ్భయోనేః ఉదయాత్ అమ్భసా ప్రసేదే రఘోః అభిభవాశఙ్కినా ద్విషతాం మనసా చుక్షుభే

సరలార్థః
ఏకతః అగస్త్యే నభసి సముదితే వర్షాకలుషితాని సలిలాని నిర్మలాని జాతాని అన్యతస్తు దిగ్విజయాయ సముదితే రఘౌ శత్రునృపాణాం మనాంసి ఉద్వేగకలుషితాని అభూవన్

తాత్పర్యమ్
అగస్త్యనక్షత్రము ఉదయించగానే (సరోవరములలో, నదులలో) నీరు తేటబడ్డాయి. రఘువు అభ్యుదయము వలన తమకు పరాభవము కలగనున్నదన్న శంకతో శత్రురాజుల మనస్సులు కలత బడ్డాయి.
[అగస్త్య నక్షత్రోదయం శరదృతువు ఆగమనానికి సూచన.]