Showing posts with label తవ మన్త్రకృతో మన్త్రైః. Show all posts
Showing posts with label తవ మన్త్రకృతో మన్త్రైః. Show all posts

Saturday, June 30, 2018

రఘువంశమ్-1.61

శ్లోకః
తవ మన్త్రకృతో మన్త్రైః దూరాత్ ప్రశమితారిభిః ।
ప్రత్యాదిశ్యన్త ఇవ మే దృష్టలక్ష్యభిదః శరాః ॥1.61

పదవిభాగః
తవ మన్త్ర-కృతః మన్త్రైః దూరాత్ ప్రశమిత-అరిభిః । ప్రత్యాదిశ్యన్తః ఇవ మే దృష్ట-లక్ష్య-భిదః శరాః ॥

అన్వయః
మన్త్రకృతః తవ దూరాత్ ప్రశమితారిభిః మన్త్రైః దృష్టలక్ష్యభిదః మే శరాః ప్రత్యాదిశ్యన్తే ఇవ 1.61

వాచ్యపరివర్తనమ్
మన్త్రకృతః తవ దూరాత్ ప్రశమితారయః మన్త్రాః దృష్టలక్ష్యభిదః మే శరాన్ ప్రత్యాదిశన్తి ఇవ

సరలార్థః
అహో, తే మన్త్రాణాం ప్రతాపః యైః మంత్రైస్త్వం మదీయానరీన్ పరోక్ష ఏవ నాశయసి! అతః అరీణామ్ అభావాత్ మే బాణాః నిష్ప్రయోజనా ఆసన్. త్వన్మంత్రసామర్థ్యేనైవ మే సర్వారిశాన్తిః

తాత్పర్యమ్
(దిలీపుడు ఇంకా ఇలా అంటున్నాడు) మంత్రకర్తవైన మీయొక్క మంత్రములు దూరంగా (అగోచరంగా) ఉన్న శత్రువులను సైతం నశింపజేయగలవు. ఆ మంత్రములచేత, కంటికి కనబడే లక్ష్యాన్ని మాత్రమే భేదించగల నా బాణాలు ధిక్కరించబడుతున్నాయి.
(మీ మంత్రశక్తిచేతనే ఎక్కడో ఉన్ననా శత్రువులు నశిస్తూ ఉండగా - దగ్గరికి వస్తే తప్ప లక్ష్యాన్ని భేదించలేని - నా బాణాలకు పనిలేదు కదా!)