Showing posts with label భీమకాన్తైః. Show all posts
Showing posts with label భీమకాన్తైః. Show all posts

Tuesday, March 13, 2018

రఘువంశమ్-1.16


శ్లోకః
భీమకాన్తైర్నృపగుణైః స బభూవోపజీవినామ్ ।
అధృష్యశ్చాభిగమ్యశ్చ యాదోరత్నైరివార్ణవః 1.16

పదవిభాగః
భీమ-కాన్తైః నృప-గుణైః సః బభూవ ఉపజీవినామ్ । అధృష్యః చ అభిగమ్యః చ యాదః-రత్నైః ఇవ అర్ణవః

అన్వయః
సః యాదోరత్నైః అర్ణవ ఇవ భీమకాన్తైః నృపగుణైః ఉపజీవినామ్ అధృష్యేణ అభిగమ్యేన చ బభూవ1.16

వాచ్యపరివర్తనమ్
యాదోరత్నైః అర్ణవేన ఇవ భీమకా భీమకాన్తైః నృపగుణైః ఉపజీవినామ్ అధృష్యేణ అభిగమ్యేన చ బభూవే

సరలార్థః
యథా సాగరః పరమమనోహరైః ముక్తాదిభిః జనానామాశ్రయణీయో భవతి భయఙ్కరైస్తిమిమకరాదిభిశ్చ దుర్గమనీయో భవతి తథైవ సోఽపి నృపతిః జనమనోహరైః కరుణాచతురతాదిభిః ప్రజానామాశ్రయణీయః దుస్సహైః తేజఃప్రతాపాదిభిశ్చ తాసామతిగహనో బభూవ. (స రాజా జలధివత్ అతిగమ్భీరసత్త్వః ముక్తా ఇవ సజ్జనానాం ప్రియదర్శనః మత్స్యాదిరివ క్రూరపురుషాణాం భీమదర్శనశ్చాసీదితి భావః)

తాత్పర్యమ్
భయంకరమైన జంతువులతో, మనోహరాలైన రత్నాలతో ఉన్న సముద్రం వలె అతడు (ఒకేసమయంలో) భీతినీ ప్రీతినీ కలిగించే తన రాజగుణములచేత పాలితులకు (ఏకకాలంలో) అందరానివాడై, ఆశ్రయించదగినవాడై ఉండేవాడు.
(రాజు కేవలం దయాదాక్షిణ్యాలను ప్రదర్శిస్తే సేవకులకు/ఆశ్రితులకు అలుసవుతాడు. అలాగని, అతికఠినంగా, దుర్నిరీక్ష్యంగా ఉంటే వారి అనురాగానికి, భక్తివిధేయతలకు దూరమవుతాడు. సమతూకం సాధించగలిగితే, గౌరవాభిమానాలను సంపాదించుకోగలుగుతాడు;
యాదః సముద్ర జంతువు)