Showing posts with label sOpaSyatpraNidhAnEna. Show all posts
Showing posts with label sOpaSyatpraNidhAnEna. Show all posts

Saturday, July 14, 2018

రఘువంశమ్-1.74

శ్లోకః
సోఽపశ్యత్ప్రణిధానేన సన్తతేః స్తమ్భకారణమ్ ।
భావితాత్మా భువో భర్తురథైనం ప్రత్యబోధయత్ ॥1.74

పదవిభాగః
సః అపశ్యత్ ప్రణిధానేన సన్తతేః స్తమ్భ-కారణమ్ । భావిత-ఆత్మా భువః భర్తుః అథ ఏనం ప్రత్యబోధయత్ ॥

అన్వయః
భావితాత్మా సః (వశిష్ఠః) భువో భర్తుః (దిలీపస్య) సన్తతేః స్తమ్భ-కారణం ప్రణిధానేన అపశ్యత్. అథ ఏనం (దిలీపం) ప్రత్యబోధయత్ 1.74

వాచ్యపరివర్తనమ్
భావితాత్మనా తేన భువః భర్తుః సన్తతేః స్తమ్భకారణం ప్రణిధానేన అదృశ్యత. అథ ఏషః ప్రత్యబోధ్యత

సరలార్థః
జితేన్ద్రియః వశిష్ఠః యోగమార్గేణ దిలీపస్య సుతోత్పత్తేః ప్రతిబన్ధకారణం జ్ఞాత్వా దిలీపం తత్ జ్ఞాపితవాన్

తాత్పర్యమ్
జితేంద్రియుడైన వశిష్ఠుడు, యోగమార్గములో, భూపతియైన దిలీపుడికి సంతానం కలగకపోవడానికి గల కారణాన్ని చూసాడు (తెలిసికొన్నాడు). అటుపై అతడు దానిని దిలీపుడికి వివరించాడు.

[భావితాత్మ అన్న మాటకు జితేంద్రియుడనే కాక, శుద్ధమైన అంతఃకరణము గలవాడు అని, ఆత్మస్వరూపమును తెలిసినవాడు; తెలియజేయబడిన జీవాత్మ గలవాడు (భావితః యథాస్వరూపంబుద్ధః ఆత్మా క్షేత్రజ్ఞః) అని అర్థాలు వేరే వ్యాఖ్యల్లో కనబడ్డాయి; ప్రణిధానము అంటే ఈ వ్యాఖ్యలో యోగమార్గము అని చెప్పారు; సమాధి అని శబ్దకల్పద్రుమములో ఉన్నది. ఏకాగ్రచిత్తము/చిత్తైకాగ్ర్యము అని ఇతరవ్యాఖ్యలలో ఉన్నది.]