Sunday, September 16, 2018

రఘువంశమ్- 4.88


శ్లోకః
తే రేఖాధ్వజకులిశాతపత్రచిహ్నం సమ్రాజశ్చరణయుగం ప్రసాదలభ్యమ్
ప్రస్థానప్రణతిభిరఙ్గులీషు చక్రుర్మౌలిస్రక్చ్యుతమకరన్దరేణుగౌరమ్4.88

పదవిభాగః
తే రేఖా-ధ్వజ-కులిశ-ఆతపత్ర-చిహ్నం సమ్రాజః-చరణ-యుగం ప్రసాద-లభ్యమ్ ప్రస్థాన-ప్రణతిభిః-అఙ్గులీషు చక్రుః మౌలిస్రక్-చ్యుత-మకరన్ద-రేణు-గౌరమ్

అన్వయః
తే (రాజన్యాః) రేఖాధ్వజకులిశాతపత్రచిహ్నం ప్రసాదలభ్యం సమ్రాజః (రఘోః) చరణయుగమ్ అఙ్గులీషు ప్రస్థానప్రణతిభిః మౌలిస్రక్చ్యుతమకరన్దరేణుగౌరం చక్రుః4.88

వాచ్యపరివర్తనమ్
తైః రేఖాధ్వజకులిశాతపత్రచిహ్నం ప్రసాదలభ్యం సమ్రాజః (రఘోః) చరణయుగమ్ అఙ్గులీషు ప్రస్థానప్రణతిభిః మౌలిస్రక్చ్యుతమకరన్దరేణుగౌరం చక్రే

సరలార్థః
ప్రయాణకాలే తే సర్వే భూపాః చక్రవర్తిలక్షణోపేతే రఘోః చరణద్వన్ద్వే నిపత్య ప్రణేముః, తదా తేషాం శిరోమాల్యవిగలితాః పుష్పరసాః పరాగాశ్చ రఘోః చరణద్వయమ్ అలంచక్రుః

తాత్పర్యమ్
ధ్వజరేఖ, కులిశరేఖ, చత్రరేఖ అనే మూడు సార్వభౌమలక్షణాలను కలిగినవీ, అతని అనుగ్రహము ఉంటేనే తప్ప సేవించలేనటువంటివీ అయిన రఘువు పాదాలను ఆ రాజులు ప్రయాణసమయంలో నమస్కరించారు. వారి తలలపై పూలదండలనుంచి స్రవించిన తేనెలతో పుప్పొడులతో రఘువు పాదాలు ఎర్రబడ్డాయి.
[కలశాతపత్రం అని పాఠాంతరము]

రఘువంశమ్- 4.87


శ్లోకః
సత్రాన్తే సచివసఖః పురస్క్రియాభిర్గుర్వీభిః శమితపరాజయవ్యలీకాన్
కాకుత్స్థశ్చిరవిరహోత్సుకావరోధాన్రాజన్యాన్ స్వపురనివృత్తయే అనుమేనే4.87

పదవిభాగః
సచివ-సఖః కాకుత్స్థః సత్ర-అన్తే పురస్క్రియాభిః గుర్వీభిః శమిత-పరాజయ-వ్యలీకాన్ చిర-విరహ-ఉత్సుక-అవరోధాన్ రాజన్యాన్ స్వపుర-నివృత్తయే అనుమేనే

అన్వయః
సచివసఖః కాకుత్స్థః సత్రాన్తే గుర్వీభిః పురస్క్రియాభిః శమితపరాజయవ్యలీకాన్ చిరవిరహోత్సుకావరోధాన్ రాజన్యాన్ స్వపురనివృత్తయే అనుమేనే4.87

వాచ్యపరివర్తనమ్
సచివసఖేన కాకుత్స్థేన సత్రాన్తే గుర్వీభిః పురస్క్రియాభిః శమితపరాజయవ్యలీకాః చిరవిరహోత్సుకావరోధాః రాజన్యా స్వపురనివృత్తయే అనుమేనిరే

సరలార్థః
సమాప్తే చ యజ్ఞే మన్త్రిసహితో రఘుః బహుతరైః దానమానైః సత్కారం కృత్వా, పరాభవప్రాప్తానాం నృపతీనాం పరాభవక్షోభం నివారయామాస, ప్రియాభ్యః చిరవిరహితాంశ్చ తాన్ నృపతీన్ స్వరాష్ట్రగమనాయ అనుజ్ఞాతవాన్

తాత్పర్యమ్
యజ్ఞము పూర్తయ్యాక మంత్రిసమేతుడైన రఘువు అనేక బహుమానాలను ఇచ్చి, పరాజయదుఃఖపీడితులై ఉన్న రాజులను ఊరడించాడు. విరహార్తలైన తమ అంతఃపురస్త్రీల చేత ఎదురుచూడబడుతున్న ఆ రాజులను తమ తమ నగరాలకు వెళ్ళేందుకు అనుమతినిచ్చాడు.

Saturday, September 15, 2018

రఘువంశమ్- 4.86


శ్లోకః
స విశ్వజితమాజహ్రే యజ్ఞం సర్వస్వదక్షిణమ్
ఆదానం హి విసర్గాయ సతాం వారిముచామివ4.86

పదవిభాగః
స విశ్వజితమ్ జహ్రే యజ్ఞం సర్వస్వ-దక్షిణమ్ ఆదానం హి విసర్గాయ సతాం వారిముచామ్ ఇవ

అన్వయః
సః (రఘుః) సర్వస్వదక్షిణం విశ్వజితం యజ్ఞమ్ ఆజహ్రే, హి (యతః) వారిముచామ్ ఇవ సతామ్ ఆదానం విసర్గాయ (భవతి) 4.86

వాచ్యపరివర్తనమ్
తేన సర్వస్వదక్షిణః విశ్వజిత్ యజ్ఞః ఆజహ్రే, హి (యతః) వారిముచామ్ ఇవ సతామ్ ఆదానేన విసర్గాయ భూయతే

సరలార్థః
స రఘుః పశ్చాత్ విశ్వజిన్నామకం మహాయజ్ఞం కృతవాన్ యస్మింశ్చ స్వభుజోపార్జితం సమ్పూర్ణమైశ్వర్యం దక్షిణారూపేణ దత్తవాన్, మేఘా యథా జలదానాయ సలిలాని ఆదదతే, ఏవం మహాత్మానోపి దానాయ ధనాని ఆదదతే, న స్వప్రయోజనాయ

తాత్పర్యమ్
తన సర్వస్వాన్ని దక్షిణగా సమర్పిస్తూ అతడు విశ్వజిత్ అనే యాగాన్ని చేసాడు. మేఘముల వలె మహాత్ములు కూడా ఇవ్వడం కోసమే సంపాదిస్తారు కదా!

రఘువంశమ్- 4.85


శ్లోకః
ఇతి జిత్వా దిశో జిష్ణుర్న్యవర్తత రథోద్ధతమ్
రజో విశ్రామయన్రాజ్ఞాం ఛత్రశూన్యేషు మౌలిషు4.85

పదవిభాగః
ఇతి జిత్వా దిశః జిష్ణుః న్యవర్తత రథ-ఉద్ధతమ్ రజః విశ్రామయన్ రాజ్ఞాం ఛత్ర-శూన్యేషు మౌలిషు

అన్వయః
జిష్ణుః (సః రఘుః) ఇతి దిశః జిత్వా ఛత్రశూన్యేషు రాజ్ఞాం మౌలిషు రథోద్ధతం రజః విశ్రామయన్ (సన్) న్యవర్తత4.85

వాచ్యపరివర్తనమ్
జిష్ణునా (తేన రఘుణా) ఇతి దిశః జిత్వా ఛత్రశూన్యేషు రాజ్ఞాం మౌలిషు రథోద్ధతం రజః విశ్రామయతా (సతా) న్యవర్తత

సరలార్థః
ఇత్థం విజయీ రఘుః సమ్పూర్ణాం పృథివీం నిర్జిత్య జగతః ఏకాధిపత్యం లబ్ధ్వా నిజరాజధానీమ్ అజగామ । తస్య రథోత్కీర్ణాని రజాంసి పరాభూతస్య భూపతిమణ్డలస్య ఛత్రరహితేషు ముకుటేషు ససఞ్జుః 

తాత్పర్యమ్
ఈ విధంగా దిగ్విజయాన్ని పూర్తి చేసిన ఆ విజేత (రఘువు) తన రథధూళి ఛత్రరహితులైన రాజుల తలలపై పడుతూ ఉండగా, (తన రాజధానికి) తిరిగివెళ్ళాడు.
[రఘువు ఏకఛత్రాధిపత్యాన్ని వహించినందున మిగతా రాజులు ఛత్రహీనులయ్యారని భావము.]

రఘువంశమ్- 4.84


శ్లోకః
కామరూపేశ్వరస్తస్య హేమపీఠాధిదేవతామ్
రత్నపుష్పోపహారేణచ్ఛాయామానర్చ పాదయోః4.84

పదవిభాగః
కామరూప-ఈశ్వరః తస్య హేమ-పీఠ-అధిదేవతామ్ రత్న-పుష్ప-ఉపహారేణ ఛాయామ్ ఆనర్చ పాదయోః

అన్వయః
కామరూపేశ్వరః హేమపీఠాధిదేవతాం తస్య (రఘోః) పాదయోః ఛాయాం రత్నపుష్పోపహారేణ ఆనర్చ 4.84

వాచ్యపరివర్తనమ్
కామరూపేశ్వరేణ రత్నపుష్పోపహారేణ హేమపీఠాధిదేవతా తస్య పాదయోః ఛాయా ఆనర్చే

సరలార్థః
యథా హి కశ్చిత్ పరమదేవతాం ప్రసాదయితుం కుసుమాఞ్జలినా తాం యత్నతః పూజయతి, తయా కామరూపేశ్వరోఽపి నిర్మలే సువర్ణమయే పాదపీఠే తస్య అధిష్ఠాత్రీ దేవతామివ రఘోః చరణచ్ఛాయాం కుసుమాఞ్జలినా పూజయామాస

తాత్పర్యమ్
కామరూపరాజ్యపు ప్రభువు సువర్ణపీఠముపై నిలిపిన దేవత వలె ఉన్న రఘువు యొక్క పాదాలకు రత్నపుష్పములను సమర్పించి పూజించాడు.

రఘువంశమ్- 4.83


శ్లోకః
తమీశః కామరూపాణామత్యాఖణ్డలవిక్రమమ్
భేజే భిన్నకటైర్నాగైరన్యానుపరురోధ యైః4.83

పదవిభాగః
తమీశః కామరూపాణామ్ అతి-ఆఖణ్డల-విక్రమమ్ భేజే భిన్న-కటైః నాగైః అన్యాన్ ఉపరురోధ యైః

అన్వయః
కామరూపాణామ్ ఈశః యైః (గజైః) అన్యాన్ (రాజ్ఞః) ఉపరురోధ, భిన్నకటైః తైః నాగైః అత్యాఖండలవిక్రమం తం (రఘుమ్) భేజే4.83

వాచ్యపరివర్తనమ్
కామరూపాణామ్ ఈశేన యైః అన్యే ఉపరురుధిరే,భిన్నకటైః తై నాగైః అత్యాఖండలవిక్రమః సః ( రఘుః) భేజే

సరలార్థః
కామరూపేశ్వరః యుద్ధే మహాబలైః మత్తగజైః బహుశః శత్రుపక్షాన్ నిరాచకార, తానేవ మత్తగజాన్ ఉపహృత్య తం రఘుం శరణం ప్రాప్తవాన్

తాత్పర్యమ్
పరాక్రమములో ఇంద్రుడిని మించిన రఘువుకు కామరూపదేశపు రాజు - ఇతరరాజులను జయించిన - మదపుటేనుగులను కానుకగా ఇచ్చి సేవించాడు.

రఘువంశమ్- 4.82


శ్లోకః
న ప్రసేహే స రుద్ధార్కమధారావర్షదుర్దినమ్
రథవర్త్మరజోఽప్యస్య కుత ఏవ పతాకినీమ్ 4.82

పదవిభాగః
న ప్రసేహే స రుద్ధ-అర్కమ్ అధారా-వర్ష-దుర్దినమ్ రథ-వర్త్మ-రజః అపి అస్య కుత ఏవ పతాకినీమ్

అన్వయః
సః (ప్రాగ్జ్యోతిషేశ్వరః) అస్య (రఘోః) అధారావర్షదుర్దినం రుద్ధార్కం రథవర్త్మరజః అపి న ప్రసేహే, పతాకినీం (తు) కుత ఏవ (ప్రసేహే) 4.82

వాచ్యపరివర్తనమ్
తేన అస్య (రఘోః) అధారావర్షదుర్దినం రుద్ధార్కం రథవర్త్మరజః అపి న ప్రసేహే పతాకినీ తు కుత ఏవ (ప్రసేహే)

సరలార్థః
ఘనం మేఘసమూహమివ రవిమణ్డలాచ్ఛాదకం రఘుసైన్యరథోత్థితం ధూలిసమూహం దృష్ట్వైవ ప్రాగ్జ్యోతిషేశ్వరః వ్యాకులోభూత్, రఘుసైన్యేన సహ తస్య సమరః కుతః

తాత్పర్యమ్
రఘువుయొక్క రథములు నడచిన దారిలో రేగిన దుమ్ము మేఘంలాగా సూర్యుడిని కప్పివేసి దుర్దినాన్ని సృష్టించింది. ఆ దుమ్మునే తట్టుకోలేని ప్రాగ్జ్యోతిషపతి  అతడి సైన్యాన్ని ఏవిధంగా తట్టుకోగలడు?
(మేఘచ్ఛన్నేఽహ్ని దుర్దినమ్అమరకోశంపగలు మేఘావృతమైనప్పుడు దుర్దినము అంటారు)