Showing posts with label రఘువు జననం-బాల్యం. Show all posts
Showing posts with label రఘువు జననం-బాల్యం. Show all posts

Tuesday, August 28, 2018

రఘువంశమ్-3.31


శ్లోకః
త్వచం స మేధ్యాం పరిధాయ రౌరవీమశిక్షతాస్త్రం పితురేవ మన్త్రవత్
న కేవలం తద్గురురేకపార్థివః క్షితావభూదేకధనుర్ధరోఽపి సః ॥3.31

పదవిభాగః
త్వచం స మేధ్యాం పరిధాయ రౌరవీమ్ అశిక్షత-అస్త్రం పితుః ఏవ మన్త్రవత్న కేవలం తత్ గురుః ఏక-పార్థివః క్షితౌ అభూత్ ఏక-ధనుర్ధరః అపి సః ॥

అన్వయః
స (రఘుః) మేధ్యాం రౌరవీం త్వచం పరిధాయ పితుః ఏవ మన్త్రవత్, అస్త్రం అశిక్షత. తద్ గురుః క్షితౌ కేవలం ఏకపార్థివః న (అభూత్) (కిం తు) సః ఏకధనుర్ధరః అపి అభూత్ 3.31

వాచ్యపరివర్తనమ్
తేన మేధ్యాం రౌరవీం త్వచం పరిధాయ, పితుః ఏవ మన్త్రవత్ అస్త్రాన్ అశిక్ష్యత, తద్గురుణా క్షితౌ కేవలం ఏకపార్థివేన న (అభూయత) తేన ఏకధనుర్ధరేణ అపి అభూయత

సరలార్థః
స రాజా సంసారే యథా ఏకః చక్రవర్తీ బభూవ తథా అద్వితీయః ధనుర్వేదపండితోఽప్యాసీత్. అతః స్వయమేవ స్వపుత్రం ధనుర్వేదమధ్యాపయామాస, సోఽపి కుమారః మృగచర్మం పరిధాయ సరహస్యం దివ్యాస్త్రసమూహం యథావిధి అధికృతవాన్

తాత్పర్యమ్
అతడు (రఘువు) రురుమృగం అనబడే నల్లని జింకయొక్క శుభ్రమైన చర్మాన్ని ధరించి తండ్రివలెనే అస్త్రవిద్యను నేర్చుకున్నాడు. అతని తండ్రి కేవలము అద్వితీయుడైన రాజు మాత్రమే కాదు, అద్వితీయుడైన విలుకాడు కూడా.
(రఘువుకు ధనుర్విద్యను దిలీపుడే నేర్పాడు అని భావము).

రఘువంశమ్-3.30


శ్లోకః
ధియః సమగ్రైః స గుణైరుదారధీః క్రమాచ్చతస్రశ్చతురర్ణవోపమాః ।
తతార విద్యాః పవనాతిపాతిభిర్దిశో హరిద్భిర్హరితామివేశ్వరః ॥3.30

పదవిభాగః
ధియః సమగ్రైః స గుణైః ఉదార-ధీః క్రమాత్ చతస్రః చ తు చతుః-అర్ణవ-ఉపమాః తతార విద్యాః పవన-అతిపాతిభిః దిశః హరిద్భిః హరితామ్ ఇవ ఈశ్వరః ॥

అన్వయః
ఉదారధీః సః (రఘుః) ధియః సమగ్రైః గుణైః క్రమాత్ చతురర్ణవోపమాః చతస్రః విద్యాః, హరితామ్ ఈశ్వరః పవనాతిపాతిభిః హరిద్భిః దిశః ఇవ, తతార 3.30

వాచ్యపరివర్తనమ్
ఉదారధియా తేన ధియః సమగ్రైః గుణైః క్రమాత్ చతురర్ణవోపమాః చతస్రః విద్యాః హరితామ్ ఈశ్వరేణ ఇవ తతరిరే

సరలార్థః
యథా రవిః వేగవత్తరైః స్వకీయైః వాజిభిః సాగరచతుష్టయవత్ అపారస్య దిక్చతుష్టయస్య పారన్ అనాయాసేనైవ యాతి, తథా స రఘురపి స్వకీయైః బుద్ధిగుణైః అనంతస్య విద్యాచతుష్టయస్య పారం పరిశ్రమేణ వినా యయౌ

తాత్పర్యమ్
వాయువు కన్నా వేగవంతమైన గుర్రాల సహాయంతో సూర్యుడు నాలుగు దిక్కులను అధిగమించినట్లుగొప్ప బుద్ధిని కలిగియున్న అతడు తన బుద్ధియొక్క అన్ని గుణాల చేత (సహాయంతో),చతుస్సాగరాలతో పోల్చదగిన విద్యలను దాటివేసాడు (ఆ విద్యలలో పారంగతుడయ్యాడు)
[కేశవపంతుల వారి వ్యాఖ్య నుంచి: నాలుగు విద్యలు అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి; బుద్ధియొక్క గుణాలు శుశ్రూష, శ్రవణం, గ్రహణం, ఊహాపోహలు, అర్థవిజ్ఞానం, తత్త్వవిజ్ఞానం]

రఘువంశమ్-3.29

శ్లోకః
అథోపనీతం విధివద్విపశ్చితో వినిన్యురేనం గురవో గురుప్రియమ్ ।
అవన్ధ్యయత్నాశ్చ బభూవురత్ర తే క్రియా హి వస్తూపహితా ప్రసీదతి 3.29

పదవిభాగః
అథ ఉపనీతం విధివత్ విపశ్చితః వినిన్యుః ఏనం గురవః గురు-ప్రియమ్ । అవన్ధ్య-యత్నాః చ బభూవురత్ర తే క్రియా హి వస్తూపహితా ప్రసీదతి

అన్వయః
అథ విపశ్చితః గురవః విధివత్ ఉపనీతం గురుప్రియం ఏనం (రఘుం) వినిన్యుః అత్ర (రఘౌ) తే (గురవః) అవన్ధ్యయత్నాః బభూవుః హి వస్తూపహితా క్రియా ప్రసీదతి 3.29

వాచ్యపరివర్తనమ్
అథ విపశ్చిద్భిః గురుభిః విధివద్ ఉపనీతః గురుప్రియః ఏషః వినిన్యే, అత్ర తైః అవన్ధ్యయత్నైః బభూవే, హి వస్తూపహితయా క్రియయా ప్రసద్యతే

సరలార్థః
అథ గర్భైకాదశే వర్షే రఘోః ఉపనయనసంస్కారే కృతే సతి నిపుణాః ఆచార్యాః గురుసేవకం తం రఘుం విద్యాః శిక్షితవన్తః తే సత్పాత్రం కుమారం ఉపదిశ్య సఫలప్రయత్నాః జాతాః యతః సత్పాత్రే శిక్షా సఫలా భవతి

తాత్పర్యమ్
అటు పిమ్మట, శాస్త్రప్రకారముగా (పదకొండవ ఏట) ఉపనయనము చేయబడిన వాడూ, గురువులకు ప్రీతి కలిగించేవాడూ అయిన రఘువుకు, పండితులైన గురువులు విద్య నేర్పించారు. ఆ యత్నాలన్నీ సఫలమే అయ్యాయి. పాత్రత కలిగిన వారికి చేసే బోధన సఫలమే అవుతుంది కదా.

Saturday, August 25, 2018

రఘువంశమ్-3.28


శ్లోకః
స వృత్తచూలశ్చలకాకపక్షకైరమాత్యపుత్రైః సవయోభిరన్వితః ।
లిపేర్యథావత్ గ్రహణేన వాఙ్మయం నదీముఖేనేవ సముద్రమావిశత్ ॥3.28

పదవిభాగః
స వృత్త-చూలః చల-కాకపక్షకైః అమాత్య-పుత్రైః సవయోభిః అన్వితః । లిపేః యథావత్ గ్రహణేన వాఙ్మయం నదీ-ముఖేన ఇవ సముద్రమ్ ఆవిశత్ ॥

అన్వయః
వృత్తచూలః చలకాకపక్షకైః సవయోభిః అమాత్య-పుత్రైః అన్వితః సః (రఘుః) లిపేః యథావత్ గ్రహణేన నదీ-ముఖేన సముద్రం ఇవ వాఙ్మయం ఆవిశత్ 3.28

వాచ్యపరివర్తనమ్
వృత్తచూలేన చలకాకపక్షకైః సవయోభిః అమాత్యపుత్రైః అన్వితేన తేన, లిపేర్యథావత్ గ్రహణేన నదీముఖేన సముద్ర ఇవ వాఙ్మయం ఆవిశత్

సరలార్థః
యథా మకరాదిజలజన్తుః నదీమాశ్రిత్య తేనైవ పథా అనన్తసాగరే గచ్ఛతి, తథా కృతచూడాకరణః రఘురపి సమవయస్కైః మనోహరైః సచివసుతైః సహ వర్ణమాలాం యథావిధి అభ్యస్య క్రమేణ అనన్తశబ్దశాస్త్రస్య పారం గతవాన్

తాత్పర్యమ్‍
పుట్టువెంట్రుకలు తీసివేసాక చిన్న జుట్టు (పిలక?)తోనున్న రఘువు అల్లలాడే కూకటి జుట్టు గల మంత్రికుమారులతో కలిసి వర్ణమాలను ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకొని అనంతమైన శబ్దశాస్త్రంలోనికి ప్రవేశించాడు, మకరాది జలజంతువులు నదీముఖమునుండి సముద్రములో ప్రవేశించినట్లు.
(రఘువూ అతడి సహాధ్యాయులకు జలజంతువులతో సాదృశ్యము, వర్ణమాలకు నదీముఖముతో, వాఙ్మయము/శబ్దశాస్త్రమునకు సముద్రముతో పోలిక)

రఘువంశమ్-3.27


శ్లోకః
అమంస్త చానేన పరార్ధ్యజన్మనా స్థితేరభేత్తా స్థితిమన్తమన్వయమ్
స్వమూర్తిభేదేన గుణాగ్ర్యవర్తినా పతిః ప్రజానామివ సర్గమాత్మనః ॥3.27

పదవిభాగః
అమంస్త చ అనేన పర-అర్ధ్య-జన్మనా స్థితేః అభేత్తా స్థితిమన్తమ్ అన్వయం । స్వ-మూర్తి-భేదేన గుణ-అగ్ర్య-వర్తినా పతిః ప్రజానామ్ ఇవ సర్గమ్ ఆత్మనః ॥

అన్వయః
స్థితేః అభేత్తా ప్రజానాం పతిః పరార్ధ్యజన్మనా గుణాగ్ర్యవర్తినా స్వమూర్తిభేదేన ఆత్మనః సర్గం ఇవ, అన్వయం స్థితిమన్తమ్ అమంస్త 3.27

వాచ్యపరివర్తనమ్
స్థితేః అభేత్త్రా, పరార్ధ్యజన్మనా అనేన అన్వయః స్థితిమాన్ ప్రజానాం పత్యా, గుణాగ్ర్యవర్తినా స్వమూర్తిభేదేన ఆత్మనః సర్గః ఇవ, అమాని

సరలార్థః
యథా విశ్వనియన్తా బ్రహ్మా సత్త్వగుణస్య ఆధారేణ స్వరూపభేదేన విష్ణునా ఆత్మసృష్టం బ్రహ్మాణ్డం స్థితిశీలం మేనే, తథా లోకాధిపః దిలీపః తేన పుత్రేణ స్వకీయం వంశం స్థితిశీలం మేనే

తాత్పర్యమ్
తనకు ప్రతిరూపమూ, త్రిగుణములలో మొదటిదైన సత్త్వగుణమును కలిగి ఉన్నవాడూ అయిన విష్ణువు చేత తన సృష్టిమర్యాద ప్రతిష్ఠితమైనదని బ్రహ్మ భావించినట్లే, ఉత్కృష్టమైన జన్మను పొందిన రఘువు కారణంగా తన వంశము నిలిచినట్లు దిలీపుడు భావించాడు

రఘువంశమ్-3.26


శ్లోకః
తమఙ్కమారోప్య శరీరయోగజైః సుఖైర్నిషిచన్తమివామృతం త్వచి ।
ఉపాన్తసమ్మీలితలోచనో నృపశ్చిరాత్సుతస్పర్శరసజ్ఞతా యయౌ 3.26

పదవిభాగః
తమ్ అఙ్కమ్ ఆరోప్య శరీర-యోగజైః సుఖైః నిషిచన్తమ్ ఇవ అమృతం త్వచిఉపాన్త-సమ్మీలిత-లోచనః నృపః చిరాత్ సుత-స్పర్శ-రసజ్ఞతా యయౌ ॥

అన్వయః
శరీరయోగజైః సుఖైః త్వచి అమృతం నిషిచన్తమ్ ఇవ తం (సుతం) అఙ్కమ్ ఆరోప్య ఉపాన్తసమ్మీలితలోచనః నృపః చిరాత్ సుతస్పర్శరసజ్ఞతా యయౌ 3.26

వాచ్యపరివర్తనమ్
ఉపాన్తసమ్మీలితలోచనేన నృపేణ శరీరయోగజైః సుఖైః త్వచి అమృతం నిషిచన్తమ్ ఇవ తమ్ అఙ్కమ్ ఆరోప్య చిరాత్ సుతస్పర్శరసజ్ఞతా యయే

సరలార్థః
సర్వాఙ్గేషు అమృతమివ సఙ్చారయన్తం తం సుతమ్ అఙ్కే నిధాయ తత్ అఙ్గేషు స్వాఙ్గాని గాఢం నివేశయన్ ఆనన్దాత్ చ నేత్రే నిమీలయన్ స నృపః చిరాభిలాషితం పుత్రస్పర్శసుఖాస్వాదం లేభే

తాత్పర్యమ్
కుమారుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని, ఆ శరీరస్పర్శ కలిగించిన సుఖము చర్మముపై అమృతము చిలకరించినట్లుండగా, కన్నులను మోడ్చి పుత్రగాత్రస్పర్శానుభవాన్ని పొందాడు ఆ రాజు.

రఘువంశమ్-3.25


శ్లోకః
ఉవాచ ధాత్ర్యా ప్రథమోదితం వచో, యయౌ తదీయామవలమ్బ్య చాఙ్గులిమ్ ।
అభూచ్చ నమ్రః ప్రణిపాతశిక్షయా, పితుర్ముదం తేన తతాన సోఽర్భకః ॥3.25

పదవిభాగః
ఉవాచ ధాత్ర్యా ప్రథమ-ఉదితం వచో, యయౌ తదీయామవలమ్బ్య చ అఙ్గులిమ్ । అభూత్ చ నమ్రః ప్రణిపాత-శిక్షయా, పితుః ముదం తేన తతాన సః అర్భకః ॥

అన్వయః
సః అర్భకః ధాత్ర్యా ప్రథమోదితం వచః ఉవాచ, తదీయం అఙ్గులిం చ అవలమ్బ్య యయౌ, ప్రణిపాతశిక్షయా చ నమ్రః అభూత్, తేన పితుః ముదం తతాన 3.25

వాచ్యపరివర్తనమ్
తేన అర్భకేణ ధాత్ర్యా ప్రథమోదితం వచః ఊచే, తదీయామఙ్గులిం చ అవలమ్బ్య యయే ప్రణిపాతశిక్షయా చ నమ్రేణ అభావి, తేన పితుః ముత్ తేనే

సరలార్థః
స దిలీపకుమారః ధాత్ర్యా శిక్షితః సన్ (పితేతి) మనోహరవచనం ప్రథమం ఉచ్చారయామస, ధాత్ర్యా అఙ్గులిం ధృత్వా చలితుమ్ ఆరబ్ధవాన్, శిరసా ప్రణామం కర్తుం అశిక్షత, తస్య పుత్రస్య తాః తాః చేష్టా అవలోక్య దిలీపః అధికతరం సుఖం లబ్ధవాన్

తాత్పర్యమ్
ఆ బాలుడు (రఘువు) దాది నేర్పిన మొదటి మాటలను పలికాడు, తన చేయి పట్టుకొని మొదటి అడుగులు వేసాడు. నమస్కరించడమూ నేర్చుకొన్నాడు. ఆ యా చేష్టలను చూసి దిలీపుడు ఎంతో సంతోషాన్ని పొందాడు.

రఘువంశమ్-3.24


శ్లోకః
రథాఙ్గనామ్నోరివ భావబన్ధనం బభూవ యత్ప్రేమ పరస్పరాశ్రయమ్
విభక్తమప్యేకసుతేన తత్తయోః పరస్పరస్యోపరి పర్యచీయత ॥3.24

పదవిభాగః
రథ-అఙ్గ-నామ్నోః ఇవ భావ-బన్ధనం బభూవ యత్ ప్రేమ పరస్పర-ఆశ్రయమ్విభక్తమ్ అపి ఏక-సుతేన తత్ తయోః పరస్పరస్య ఉపరి పర్యచీయత

అన్వయః
తయోః (సుదక్షిణాదిలీపయోః) రథాఙ్గనామ్నోః ఇవ, భావబన్ధనం పరస్పరాశ్రయం యత్ ప్రేమ బభూవ, తత్ తయోః ఏకసుతేన విభక్తమ్ అపి పరస్పరస్య ఉపరి పర్యచీయత 3.24

వాచ్యపరివర్తనమ్
తయోః రథాఙ్గనామ్నోః ఇవ, భావబన్ధనేన పరస్పరాశ్రయేణ యేన ప్రేమ్ణా బభూవే, తేన తయోః ఏకసుతేన విభక్తేన అపి పరస్పరస్య ఉపరి పర్యచీయత

సరలార్థః
చక్రవాకయోరివ తయోః సుదక్షిణాదిలీపయోః పరస్పరస్య హృదయసంయోజనం యత్ అఖణ్డితం ప్రేమ స్థితం, తత్ ఏకేన సుతేన విభక్తమపి న పరిహీయతే స్మ ప్రత్యుత వర్ధతే స్మ

తాత్పర్యమ్
చక్రవాకపక్షుల జంట వంటి సుదక్షిణాదిలీపులకు పరస్పరము ఉన్న ప్రేమ, తమ ఏకైకపుత్రునికై కొంత పంచి ఇచ్చినప్పటికీ, ఏమాత్రమూ తగ్గక వృద్ధి చెందింది.

రఘువంశమ్-3.23


శ్లోకః
ఉమావృషాఙ్కౌ శరజన్మనా యథా యథా జయన్తేన శచీపురన్దరౌ
తథా నృపః సా చ సుతేన మాగధీ ననన్దతుః తత్సదృశేన తత్సమౌ॥3.23

పదవిభాగః
ఉమా-వృషాఙ్కౌ శర-జన్మనా యథా యథా జయన్తేన శచీ-పురన్దరౌ । తథా నృపః సా చ సుతేన మాగధీ ననన్దతుః తత్ సదృశేన తత్సమౌ

అన్వయః
యథా శరజన్మనా ఉమావృషాఙ్కౌ, యథా జయన్తేన శచీపురన్దరౌ ననన్దతుః, తథా తత్సదృశేన సుతేన తత్సమౌ నృపః సా మాగధీ చ (ఉభౌ) (ననన్దతుః) 3.23

వాచ్యపరివర్తనమ్
యథా శరజన్మనా ఉమావృషాఙ్కాభ్యాం, యథా జయన్తేన శచీపురన్దరాభ్యాం ననన్దే, తథా తత్సదృశేన సుతేన తత్సమాభ్యాం నృపేణ తయా మాగధ్యా చ (ఉభాభ్యాం) (ననన్దే)

సరలార్థః
యథా కార్తికేయం పుత్రం లబ్ధ్వా పార్వతీపరమేశ్వరయోః పరమానన్దో జాతః జయన్తం సుతం లబ్ధ్వా శచీమహేన్ద్రయోః పరమానన్దో జాతః, తథా రఘుం లబ్ధ్వా సుదక్షిణాదిలీపయోరపి కోఽపి పరమానన్దో బభూవ

తాత్పర్యమ్
కుమారస్వామి జన్మించడం వలన శివపార్వతులకు, జయంతుని కారణంగా శచీమహేంద్రులకు కలిగినటువంటి ఆనందమే ఆ జంటలకు సమానులైన సుదక్షిణాదిలీపులకు స్కందజయంతులతో పోల్చదగ్గ రఘువు వలన కలిగింది.

రఘువంశమ్-3.22


శ్లోకః
పితుః ప్రయత్నాత్స సమగ్రసమ్పదః శుభైః శరీరావయవైర్దినేదినే ।
పుపోష వృద్ధిం హరిదశ్వదీధితేరనుప్రవేశాదివ బాలచన్ద్రమాః ॥3.22

పదవిభాగః
పితుః ప్రయత్నాత్ సః సమగ్ర-సమ్పదః శుభైః శరీర-అవయవైః దినే-దినే । పుపోష వృద్ధిం హరిత్-అశ్వ-దీధితేః అనుప్రవేశాత్ ఇవ బాల-చంద్రమాః ॥

అన్వయః
సః (రఘుః) సమగ్రసమ్పదః పితుః ప్రయత్నాత్ హరిదశ్వదీధితేః అనుప్రవేశాత్ బాలచన్ద్రమాః ఇవ, శుభైః. శరీరావయవైః దినేదినే వృద్ధిం పుపోష 3.22

వాచ్యపరివర్తనమ్
తేన (రఘుణా) సమగ్రసమ్పదః పితుః ప్రయత్నాత్, హరిదశ్వదీధితేః అనుప్రవేశాత్ బాలచన్ద్రమసా ఇవ, శుభైః శరీరావయవైః దినేదినే వృద్ధిః పుపుషే

సరలార్థః
యథా హి శుక్లపక్షే ప్రతిపచ్చన్ద్రః తేజోనిధేః సూర్యస్య కిరణసమ్పర్కేణ కలాభిః దినేదినే వర్ధతే తథా స కుమారోఽపి పితుః ప్రయత్నేన మనోహరైః అఙ్గైః దినే దినే వవృధే

తాత్పర్యమ్
సకలైశ్వర్యవంతుడైన దిలీపుడి ప్రయత్నముచేత అతడు (రఘువు) చక్కని అవయవాలతో దినదినాభివృద్ధి చెందాడు సూర్యుడికాంతి ప్రవేశించడం వలన బాలచంద్రుడు వృద్ధి చెందినట్లు.
(హరిదశ్వ = పచ్చని గుర్రాలవాడు, సూర్యుడు)

రఘువంశమ్-3.21


శ్లోకః
శ్రుతస్య యాయాదయమన్తమర్భకస్తథా పరేషాం యుధి చేతి పార్థివః ।
అవేక్ష్య ధాతోర్గమనార్థమర్థవిచ్చకార నామ్నా రఘుమాత్మసమ్భవమ్ 3.21

పదవిభాగః
శ్రుతస్య యాయాత్ అయమ్ అన్తమ్ అర్భకః తథా పరేషాం యుధి చేతి పార్థివః । అవేక్ష్య ధాతోః గమన-అర్థమ్-అర్థవిత్ చకార నామ్నా రఘుమ్ ఆత్మసమ్భవమ్

అన్వయః
అయమ్ అర్భకః శ్రుతస్య అన్తం యాయాత్ తథా యుధి పరేషాం చ (అన్తం యాయాత్) ఇతి అర్థవిత్ పార్థివః ధాతోః గమనార్థమ్ అవేక్ష్య ఆత్మసమ్భవం నామ్నా రఘుం చకార 3.21

వాచ్యపరివర్తనమ్
అనేన అర్భకేణ శ్రుతస్య అన్తః యాయేత, తథా యుధి పరేషాం చ (అంతః యాయేత) ఇతి అర్థవిదా పార్థివేన ధాతోః గమనార్థమ్ అవేక్ష్య ఆత్మసమ్భవః నామ్నా రఘుః చక్రే

సరలార్థః
పుత్రోయం మే స్వశక్త్యా అశేష-శాస్త్ర-సాగరస్య పారం గమిష్యతి, సమ్పూర్ణ-శత్రు-సైన్య-వ్యూహం చ భిత్త్వా గమిష్యతి ఇతి తస్య గమనశీలత్వం నిశ్చిత్య స రాజా స్వపుత్రస్య రఘుః ఇతి నామధేయం చక్రే

తాత్పర్యమ్
శబ్దార్థాలను బాగుగా తెలిసినవాడైన దిలీపుడు, “ఈ బాలుడు, సకలశాస్త్రపారంగతుడవుతాడు, యుద్ధములో శత్రుసేనల అంతమును కూడా చూస్తాడుఅన్న ఎరుకతో, తన కుమారుడికి రఘువు అని పేరుపెట్టాడు.
[కేశవపంతుల వారి వ్యాఖ్య నుంచి: అఘి వఘి లఘి గత్యర్థాఃఅను పాణినీయ ధాతుపాఠమునందు చెప్పబడిన లఘిధాతువునకు గమనమని అర్థము. దానికి ఉణాదిసూత్రములచేత ఉత్వము, రేఫము సిద్ధించుట చేత రఘుఃఅను శబ్దము సిద్ధించును.]

రఘువంశమ్-3.20

శ్లోకః
న సంయతస్తస్య బభూవ రక్షితుర్విసర్జయేద్యం సుతజన్మహర్షితః ।
ఋణాభిధానాత్స్వయమేవ కేవలం తదా పితౄణాం ముముచే స బన్ధనాత్ 3.20

పదవిభాగః
న సంయతః తస్య బభూవ రక్షితుః విసర్జయేత్ యం సుత-జన్మ-హర్షితః । ఋణ-అభిధానాత్ స్వయమ్ ఏవ కేవలం తదా పితౄణాం ముముచే స బన్ధనాత్

అన్వయః
రక్షితుః తస్య (దిలీపస్య) సంయతః న బభూవ, (సః) యం సుతజన్మహర్షితః (సన్) విసర్జయేత్, సః కేవలం స్వయం ఏవ ఋణాభిధానాత్ పితృణాం బన్ధనాత్ తదా ముముచే

వాచ్యపరివర్తనమ్
రక్షితుః తస్య సంయతేన న బభూవే, (తేన) యః సుతజన్మహర్షితేన (సతా) విశ్రిజ్యేత, తేన కేవలం స్వయం ఏవ ఋణాభిధానాత్ పితృణాం బన్ధనాత్ తదా ముముచే

సరలార్థః
నృపస్య ప్రజారక్షణే తద్దేశే తస్కరాభావాత్ కోఽపి కారాబద్ధ ఏవ నాసీత్, అతోఽసౌ నృపః పుత్రజన్మ-ఆనన్దాత్ కేవలమ్ ఆత్మానమ్ ఏవ పితౄణాం ఋణరూపాత్ బన్ధనాత్ విమోచయామాస

తాత్పర్యమ్
కొడుకు పుట్టిన సంతోషంలో కారాగారములో బంధించబడినవారిని విడిపించాలని అనుకున్నాడు దిలీపుడు, అయితే, నేరాలే జరగని ఆయన పాలనలో కారాగారం ఖాళీగానే ఉండిపోయింది. కనుక దిలీపుడు కేవలము తనను తాను పితౄణము నుంచి విముక్తి చేసుకున్నాడు.

రఘువంశమ్-3.19


శ్లోకః
సుఖశ్రవా మఙ్గలతూర్యనిస్వనాః ప్రమోదనృత్యైః సహ వారయోషితామ్ ।
న కేవలం సద్మని మాగధీపతేః పథి వ్యజృమ్భన్త దివౌకసామపి ॥3.19

పదవిభాగః
సుఖశ్రవా మఙ్గల-తూర్య-నిస్వనాః ప్రమోద-నృత్యైః సహ వార-యోషితామ్ । న కేవలం సద్మని మాగధీ-పతేః పథి వ్యజృమ్భన్త దివ-ఓకసామ్ అపి ॥

అన్వయః
సుఖశ్రవాః మఙ్గలతూర్యనిస్వనాః వారయోషితాం ప్రమోదనృత్యైః సహ కేవలం మాగధీపతేః (దిలీపస్య) సద్మని న, (కింతు) దివౌకసాం పథి అపి వ్యజృమ్భన్త 3.19

వాచ్యపరివర్తనమ్
సుఖశ్రవైః మఙ్గలతూర్యనిస్వనైః వారయోషితాం ప్రమోదనృత్యైః సహ కేవలం మాగధీపతేః సద్మని న, దివౌకసాం పథి అపి వ్యజృమ్భ్యన్త

సరలార్థః
లోకహితస్య తస్య రాజపుత్రస్య జన్మమహోత్సవాత్ యథా రాజమందిరే తథా దేవభవనేపి గీత-మఙ్గల-వాద్య-ధ్వనయః ఉచ్చరంతి స్మ వేశ్యాశ్చ ప్రహర్షాత్ నృత్యంతి స్మ

తాత్పర్యమ్
చెవికింపైన మంగళవాద్యముల చప్పుడు, వేశ్యాంగనలు సంతోషముతో చేసిన నృత్యాలు మాగధీపతి (మగధరాజపుత్రియైన సుదక్షిణకు భర్త = దిలీపుడు) ఇంటనే కాదు. దేవతల దారియైన ఆకాశములోనూ విజృంభించాయి (తమకు సహాయపడగలవాడు పుట్టాడని దేవతలకు సంబరము).

రఘువంశమ్-3.18

శ్లోకః
స జాతకర్మణ్యఖిలే తపస్వినా తపోవనాదేత్య పురోధసా కృతే ।
దిలీపసూనుర్మణిరాకరోద్భవః ప్రయుక్తసంస్కార ఇవాధికం బభౌ ॥3.18

పదవిభాగః
స జాత-కర్మణి అఖిలే తపస్వినా తపః-వనాత్ ఏత్య పురోధసా కృతే । దిలీప-సూనుః మణిః ఆకర-ఉద్భవః ప్రయుక్త-సంస్కార ఇవ అధికం బభౌ ॥

అన్వయః
సః దిలీపసూనుః తపస్వినాం పురోధసా తపోవనాత్ ఏత్య అఖిలే జాతకర్మణికృతే (సతి) ఆకరోద్భవః ప్రయుక్తసంస్కారః మణిః ఇవ, అధికం బభౌ 3.18

వాచ్యపరివర్తనమ్
తేన దిలీపసూనునా, తపస్వినా పురోధసా తపోవనాత్ ఏత్య అఖిలే జాతకర్మణి కృతే (సతి) ఆకరోద్భవేన ప్రయుక్తసంస్కారేణ మణినా ఇవా అధికం బభే

సరలార్థః
స్వభావసున్దర స రాజపుత్రః ప్రభావయుక్తేన వశిష్ఠేన జాతకర్మరూపసంస్కారేణ శోధితః సన్ తథా అధికతరం శుశుభే యథా ఆకరోత్థితః హీరకమణిః శాణశోధితః సన్ అధికతరాం కాన్తిం లభతే

తాత్పర్యమ్
గనిలోని వజ్రము సానబెట్టబడినప్పుడు మరింత కాంతివంతమైనట్లు, ఆ దిలీపసుతుడు తపోవనము నుంచి వచ్చి వసిష్ఠుడు సమగ్రముగా చేయించిన జాతకర్మల కారణంగా మరింత తేజస్సును పొందాడు.
[కేశవపంతుల వారి వ్యాఖ్య నుంచి: ప్రాఙాభివర్ధనాత్ పుంసో జాతకర్మవిధీయతేఅని మనుస్మృతి. బొడ్డు కోయకముందు చేయవలసిన వైదికసంస్కారమునకు జాతకర్మఅని పేరు.]