శ్లోకః
జ్ఞానే మౌనం క్షమా శక్తౌ త్యాగే శ్లాఘావిపర్యయః ।
గుణా గుణానుబన్ధిత్వాత్తస్య సప్రసవా ఇవ ॥1.22॥
పదవిభాగః
జ్ఞానే మౌనం క్షమా శక్తౌ త్యాగే శ్లాఘా-విపర్యయః । గుణా
గుణ-అనుబన్ధిత్వాత్ తస్య సప్రసవాః ఇవ ॥
అన్వయః
తస్య జ్ఞానే (సతి) మౌనం, శక్తౌ (సత్యామ్) క్షమా, త్యాగే (సతి)
శ్లాఘావిపర్యయః (అత ఏవ తస్య) గుణాః గుణ అనుబన్ధిత్వాత్ సప్రసవాః ఇవ ఆసన్ ॥1.22॥
వాచ్యపరివర్తనమ్
తస్య జ్ఞానే (సతి) మౌనేన, శక్తౌ (సత్యాం) క్షమయా, త్యాగే (సతి)
శ్లాఘావిపర్యయేణ (అభూయత) (అత ఏవ) గుణైః సప్రసవైః ఇవ అభూయత ॥
సరలార్థః
విద్వత్సు వాక్పటుతా చపలతా, ప్రభుషు అక్షమా, దానశీలేషు
ఆత్మశ్లాఘా ప్రాయేణ దృశ్యతే, అయం తు రాజా పణ్డితోఽపి
మితవాక్,
స్వామ్యపి క్షమావాన్, దానశీలోపి
శ్లాఘాశూన్యో బభూవ ॥
తాత్పర్యమ్
పండితుడైనప్పటికీ మౌనంగా ఉండేవాడు (మితభాషి), శక్తిమంతుడైనప్పటికీ సహనంతో ఉండేవాడు, దానశీలియే గానీ గొప్పలు చెప్పుకునేవాడు కాదు. (అతడిలోని ఈ)
పరస్పరవిరుద్ధాలైన గుణాలు (జ్ఞానము-మితభాషణముల; శక్తి-సహనము; దానగుణము-ప్రశంసల యెడల అనాసక్తి) తోడబుట్టినవారివలె ఉండేవి.
(పండితులు పాండిత్యప్రదర్శనకోసం ఎక్కువగా మాట్లాడటం, పరాక్రమవంతులు ఉద్రేకస్వభావులై ఉండటం, దానబుద్ధిగలవారు తమను తాము ప్రశంసించుకోవటం లోకంలో రివాజు.
అందుకు విరుద్ధం దిలీపుడి తీరు.
జ్ఞానం-మౌనం, శక్తి-సహనం, దానశీలత-ఆత్మస్తుతివైముఖ్యం వంటి వ్యతిరేక గుణాలు ఆయనలో
సహజీవనం చేసేవి.)
బాగుంది . ఉపయోగకరమైన ప్రచురణ
ReplyDelete