శ్లోకః
నిర్దిష్టాం కులపతినా స పర్ణశాలాం
అధ్యాస్య ప్రయతపరిగ్రహద్వితీయః ।
తచ్ఛిష్యాధ్యయననివేదితావసానాం
సంవిష్టః కుశశయనే నిశాం నినాయ ॥1.95॥
పదవిభాగః
నిర్దిష్టాం కుల-పతినా స పర్ణ-శాలామ్ అధ్యాస్య
ప్రయత-పరిగ్రహ-ద్వితీయః । తత్-శిష్య-అధ్యయన-నివేదిత-అవసానాం సంవిష్టః కుశ-శయనే
నిశాం నినాయ ॥
అన్వయః
ప్రయతపరిగ్రహద్వితీయః సః (రాజా) కులపతినా (వశిష్ఠేన)
నిర్దిష్టాం పర్ణశాలామ్ అధ్యాస్య కుశశయనే సంవిష్టః (సన్) తత్ శిష్యాధ్యయన-నివేదితావసానాం
నిశాం నినాయ ॥1.95॥
వాచ్యపరివర్తనమ్
ప్రయతపరిగ్రహ-ద్వితీయేన తేన (రాజ్ఞా) కులపతినా
నిర్దిష్టాం పర్ణశాలామ్ అధ్యాస్య కుశశయనే సంవిష్టేన (సతా) తచ్ఛిష్యాధ్యయన-నివేదితావసానా
నిశా నిన్యే ॥
సరలార్థః
ఋషికులాచార్యేణ బ్రహ్మర్షిణా వశిష్ఠేన నిర్దిష్టే
పర్ణకుటీరే స దిలీపః జితేన్ద్రియయా సుదక్షిణయా సహ దర్భశయ్యాయాం సుష్వాప, వశిష్ఠశిష్యాణాం వేదాధ్యయనశబ్దేన క్షపావసానం జ్ఞాత్వా
శయనాత్ ఉత్తస్థౌ ॥
“మునీనాం దశసాహస్రం యోఽన్నదానాదిపోషణాత్ అధ్యాపయతి
విప్రర్షిరసౌ కులపతిః స్మృతః” ఇతి కులపతేః
పురాణోక్తలక్షణమ్.
తాత్పర్యమ్
ఇంద్రియసంయమనశీలినియైన భార్యతో కలిసి అతడు, కులపతియైన వశిష్ఠుడు సూచించిన కుటీరానికి వెళ్ళి, దర్భశయ్యపై శయనించి - ఆయన (వశిష్ఠుడి) శిష్యుల
వేదాధ్యయనశబ్దంతో ముగిసిన - ఆ రాత్రిని గడిపాడు (శిష్యుల వేదాధ్యయనశబ్దంతో
తెల్లవారింది అని భావము).
[కులపతి = పదివేల మంది మునులకు అన్నదానాదిపోషణము చేసి
విద్యను బోధించే విప్ర-ఋషి అని పురాణాలు చెబుతున్నాయి;
ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ ముద్రణలో ఈ క్రింది అదనపు
వివరణము ఉన్నది:
“పూర్వకాలమున శిష్యులు అపరరాత్రమునందే వేదమును కంఠస్థము
చేసెడువారు. అట్లు చేయవలయునని ధర్మశాస్త్రము. “నిశాంతే న
పరిశ్రాంతో బ్రహ్మాధీత్య పునః స్వపేత్” అని మనువు; “నచాపరరాత్రమధీత్య పునః స్వపేత్” అని గౌతముడు. (తెల్లవారుజామున చదువుకొని మరల నిద్రింపరాదు; ఒకవేళ ఎక్కువగా అలసిపోయినచో మళ్ళీ నిద్రింపవచ్చును.”)]
No comments:
Post a Comment