శ్లోకః
అథ ప్రదోషే దోషజ్ఞః సంవేశాయ విశాం పతిమ్ ।
సూనుః సూనృతవాక్స్రష్టుర్విససర్జోదితశ్రియమ్ ॥1.93॥
పదవిభాగః
అథ ప్రదోషే దోషజ్ఞః సంవేశాయ విశాం పతిమ్ । సూనుః
సూనృత-వాక్-స్రష్టుః విససర్జ ఉదిత-శ్రియమ్ ॥
అన్వయః
అథ ప్రదోషే దోషజ్ఞః సూనృతవాక్స్రష్టుః సూనుః ఉదితశ్రియం
విశాం పతిం సంవేశాయ విససర్జ ॥1.93॥
వాచ్యపరివర్తనమ్
అథ ప్రదోషే దోషజ్ఞేన సూనృతవాచా స్రష్టుః సూనునా
ఉదితశ్రీః విశాంపతిః సంవేశాయ విససృజే ॥
సరలార్థః
తతః హితమనోహారిసత్యభాషీ గుణదోషదర్శీ స వశిష్ఠేః
రాజలక్ష్మ్యా ప్రకాశమానం తం దిలీపం నిశాయాం నిద్రాయై ఆజ్ఞాపయామాస ॥
తాత్పర్యమ్
ఆ తరువాత, రాత్రి అయ్యాక
- గుణదోషములను బాగా ఎరిగిన విద్వాంసుడూ, సత్యమునే
పలికెడివాడు, సృష్టికర్తయైన బ్రహ్మకు కుమారుడు అయిన
వశిష్ఠుడు, సంపదలుదయించినవాడు, భూపతియైన దిలీపుడిని నిద్రించేందుకు విడిచిపెట్టాడు
(అనుమతించాడు).
[ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ ముద్రణలో “ఉదితశ్రియమ్” బదులు “ఊర్జితశ్రియమ్” (సమృద్ధమైన
సంపదగల) అని ఇచ్చారు].
No comments:
Post a Comment