Saturday, July 14, 2018

రఘువంశమ్-1.76

శ్లోకః
ధర్మలోపభయాత్ రాజ్ఞీం ఋతుస్నాతామిమాం స్మరన్ ।
ప్రదక్షిణక్రియార్హాయాం తస్యాం త్వం సాధు నాచరః ॥1.76

పదవిభాగః
ధర్మ-లోప-భయాత్ రాజ్ఞీం ఋతు-స్నాతామ్ ఇమాం స్మరన్ । ప్రదక్షిణ-క్రియా-అర్హాయాం తస్యాం త్వం సాధు న ఆచరః ॥

అన్వయః
(తదా) ధర్మలోపభయాత్ ఋతుస్నాతాం ఇమాం రాజ్ఞీం స్మరన్ (సన్) త్వం ప్రదక్షిణక్రియార్హాయాం తస్యాం (ధేన్వాం) సాధు న ఆచర 1.76

వాచ్యపరివర్తనమ్
ధర్మలోపభయాత్ ఋతుస్నాతాం ఇమాం రాజ్ఞీం స్మరతా (సతా) త్వయా ప్రదక్షిణ-క్రియార్హాయాం తస్యాం సాధు న ఆచర్య్యత

సరలార్థః
తదా ఇయం తవ మహిషీ సుదక్షిణా ఋతుస్నానం కృత్వా త్వత్సమాగమం ప్రేక్షణమాణా తస్థౌ. త్వమపి ఋతుసమయస్య అననుష్ఠానే పాపం స్యాదితి సుదక్షిణామేవ చేతసా స్మరన్ ప్రదక్షిణార్హాం తాం కామధేనుం ప్రదక్షిణాదిభిః సమ్మానయితుం విస్మృతవాన్ తచ్చ న శోభనం కృతమ్

తాత్పర్యమ్
(వశిష్ఠుడు రాజుతో ఇలా అంటున్నాడు) – “(అప్పుడు) ఋతుస్నాతయై (నీతో సమాగమానికి ఎదురుచూస్తూ) ఉన్న ఈ రాణిని స్మరిస్తూ, (ఆలస్యం జరిగితే) ధర్మలోపం జరుగుతుందని భయపడుతూనీవు ప్రదక్షిణార్హయైన ఆ కామధేనువును యథోచితంగా సమ్మానించ లేదు.
(ధర్మలోపభయాత్ ఋతుస్నాతాం అనుస్మరన్ అని పాఠాంతరము, ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ ముద్రణలో).

No comments:

Post a Comment