Wednesday, July 18, 2018

రఘువంశమ్-1.94

శ్లోకః
సత్యామపి తపఃసిద్ధౌ నియమాపేక్షయా మునిః ।
కల్పవిత్కల్పయామాస వన్యామేవాస్య సంవిధామ్ ॥1.94

పదవిభాగః
సత్యామ్ అపి తపః-సిద్ధౌ నియమ-అపేక్షయా మునిః । కల్పవిత్ కల్పయామాస వన్యామ్ ఏవ అస్య సంవిధామ్

అన్వయః
కల్పవిత్ మునిః తపఃసిద్ధౌ సత్యామ్ అపి నియమాపేక్షయా అస్య (నృపస్య) వన్యామ్ ఏవ సంవిధాం కల్పయామాస 1.94

వాచ్యపరివర్తనమ్
కల్పవిదా మునినా తపఃసిద్ధౌ సత్యామ్ అపి నియమాపేక్షయా అస్య వన్యా ఏవ సంవిధా కల్పయాచక్రే

సరలార్థః
స్వతపఃప్రతాపాత్ రాజయోగ్యభోక్ష్యశయ్యాదివిధానసామర్థ్యే సతి అపి వ్రతప్రయోగాభిజ్ఞః వశిష్ఠః తదా ప్రభృతి దిలీపస్య వ్రతపాలనానురోధాదేవ తదర్థే వన్యకన్దమూలఫలాదిభోజనం దర్భశయ్యాం చ సమ్పాదయామాస

తాత్పర్యమ్
(దిలీపుడు చేయవలసిన) వ్రతవిధానమును తెలిసినట్టి ఆ ముని (రాజోచితమైన సౌకర్యాలను సమకూర్చగల) తపశ్శక్తిని కలిగి ఉన్నప్పటికీ ఆ వ్రతనియమాల ప్రకారం వన్యపదార్థాలనే (తినేందుకు పళ్ళు, దుంపలు, పడుకునేందుకు దర్భశయ్య వగైరా) ఏర్పాటు చేసాడు.

No comments:

Post a Comment