Sunday, August 5, 2018

రఘువంశమ్-2.13


శ్లోకః
పృక్తస్తుషారైర్గిరినిర్ఝరాణామనోకహాకమ్పితపుష్పగన్ధీ ।
తమాతపక్లాన్తమనాతపత్రమాచారపూతం పవనః సిషేవే ॥2.13॥

పదవిభాగః
పృక్తః తుషారైః గిరి-నిర్ఝరాణాం అనోకహ-ఆకమ్పిత-పుష్ప-గన్ధీ । తమ్ ఆతప-క్లాంతమ్ అనాతపత్రమ్ ఆచార-పూతం పవనః సిషేవే ॥

అన్వయః
గిరినిర్ఝరాణాం తుషారైః పృక్తః అనోకహాకమ్పితపుష్పగన్ధీ పవనః అనాతపత్రమ్ (అత ఏవ) ఆతపక్లాన్తమ్ ఆచార-పూతం (నృపం) సిషేవే ॥2.13॥

వాచ్యపరివర్తనమ్
గిరినిర్ఝరాణాం తుషారైః పృక్తేన అనోకహాకమ్పితపుష్పగన్ధినా పవనేన, అనాతపత్ర (అత ఏవ) ఆతపక్లాన్తః ఆచారపూతః సః (నృపః) సిషేవే ॥

సరలార్థః
పర్వతసరిత్-ప్రవాహాణాం శీతలాన్ వారికణాన్ వహన్ ఈషత్కమ్పితానాం తరుపుష్పాణాం గన్ధం హరన్ మన్దో గన్ధవహః తస్మిన్ వనే ఛత్రరహితమ్ ఆతపతాపితం సదాచారపవిత్రం తం దిలీపం సేవితవాన్ ॥

తాత్పర్యమ్
కొండవాగులయొక్క నీటి తుంపరలచేత తడిసిదీ, చెట్ల(పై) నెమ్మదిగా కదులుతున్న పూవుల వాసనతో కూడియున్నదీ అయిన (ఆ అడవి) గాలి, గొడుగు లేకుండా ఎండకు బడలిన వాడూ, శుద్ధమైన ప్రవర్తన కలిగిన వాడూ అయిన దిలీపుడిని సేవించింది.

No comments:

Post a Comment