Sunday, August 5, 2018

రఘువంశమ్-2.16


శ్లోకః
తాం దేవతాపిత్రతిథిక్రియార్థామన్వగ్యయౌ మధ్యమలోకపాలః ।
బభౌ చ సా తేన సతాం మతేన శ్రద్ధేవ సాక్షాద్విధినోపపన్నా ॥2.16

పదవిభాగః
తాం దేవతా-పితృ-అతిథి-క్రియా-అర్థామ్ అన్వక్ యయౌ మధ్యమ-లోక-పాలః బభౌ చ సా తేన సతాం మతేన శ్రద్ధా-ఇవ సాక్షాత్ విధినః ఉపపన్నా ॥

అన్వయః
మధ్యమలోకపాలః దేవతాపిత్రతిథిక్రియార్థాం తాం (ధేనుం) అన్వగ్యయౌ విధినా ఉపపన్నా సాక్షాత్ శ్రద్ధా ఇవ సా సతాం మతేన తేన (రాజ్ఞా) బభౌ 2.16

వాచ్యపరివర్తనమ్
మధ్యమలోకపాలేన దేవతాపిత్రతిథిక్రియార్థా సా అన్వక్ యయే విధినోపన్నయా సాక్షాత్ శ్రద్ధయా ఇవ తయా సతాం మతేన తేన బభే

సరలార్థః
దుగ్ధాదిప్రదానేన వసిష్ఠస్య యాగశ్రాద్ధదానాదీనామ్ ఉపకర్త్రీం తాం గామ్ అనుసృత్య నరలోకపాలః చలితుమ్ ఆరేభే తథాహి శ్రద్ధాం (ధర్మే దృఢవిశ్వాసః) సజ్జనసమాదృతేన సదాచారేణ యుక్తా ఏవ శోభతే తథా మూర్తిమతీ శ్రద్ధేవ పరమపవిత్రా సా ధేనురపి సాధుజనసేవితేన (మూర్తిమతా సదాచారణైవ పరమనిర్మలేన) తేన దిలీపేన యుక్తా సతీ చకాశే

తాత్పర్యమ్
(వశిష్ఠుడి యొక్క) యజ్ఞయాగాది దేవతా కార్యాలకూ, శ్రాద్ధదానాదులకూ, అతిథిసత్కారాలకూ ఉపకరించే ఆ ఆవును భూలోకపతి అయిన దిలీపుడు అనుసరించాడు. సత్పురుషుల మెప్పును పొందిన ఆ దిలీపుడి వెంట ఉన్న ఆ ఆవు, సదాచారయుక్తమై మూర్తీభవించిన శ్రద్ధ వలె ప్రకాశించింది.

No comments:

Post a Comment